విద్యుత్తుశాఖలో నూతన సంస్కరణలు తెచ్చాం: పెద్దిరెడ్డి

Feb 15,2024 21:48
విద్యుత్తుశాఖలో నూతన సంస్కరణలు తెచ్చాం: పెద్దిరెడ్డి

ప్రజాశక్తి- పుంగనూరు: రాష్ట్రంలో విద్యుత్‌ శాఖలో పలు నూతన సంస్కరణలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పుంగనూరు మండలంలో విద్యుత్‌శాఖ ద్వారా రూ.14.5 కోట్లతో 33/11 కెవి సబ్‌స్టేషన్‌లు, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ వంటి పలు అభివద్ధి కార్యక్రమాలను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు చిత్తూరు ఎంపి ఎన్‌.రెడ్డెప్ప, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పుంగనూరులోని కపాడం మిట్టపల్లిలో టిఅండ్‌డి నిధులతో రూ.1.47కోట్లతో ట్రాన్స్ఫార్మర్‌ రిపైర్‌ సెంటర్‌ (విద్యుత్‌ నియంత్రికల మరమ్మతు కేంద్రం), ఆరడిగుంట, గోపిశెట్టిపల్లిలో పిఎఫ్‌సి నిధులతో ఒక్కొక్కటి రూ.3.22కోట్ల విలువతో రెండు 33/11 కెవి సబ్‌స్టేషన్లు, పుంగనూరు పట్టణంలో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ వద్ద రూ.5.90 కోట్లతో 1 మెగా వాట్‌ సామర్థ్యం గల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను రూ.70 లక్షలతో పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు నందు శాంతి నగర్‌లోని గహాల మీదుగా వెళుతున్న 33 కెవి విద్యుత్‌ లైన్‌ను మార్చడం వంటి పనులను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచేలా పుంగనూరు పట్టణంలోని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ వద్ద 1మెగా వాట్‌ సామర్థ్యం గల సోలార్‌ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. దీని ద్వారా పుంగనూరు మున్సిపాలిటీకి ఏటా రూ.1.20కోట్లు ఆదా అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మరో 30సంవత్సరాలు పట్టణానికి సేవలు అందిస్తుందని చెప్పారు. ఇటువంటి ప్రాజెక్టులను మిగిలిన మున్సిపాలిటీలకు విస్తరించే కషి చేస్తామన్నారు.

➡️