శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాసం

Feb 14,2024 21:26
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాసం

ప్రజాశక్తి- ఐరాల: శ్రీస్వామివారి దేవస్థానం ఆస్థాన మండపంలో బుధవారం వసంత పంచమి (శ్రీ పంచమి) సందర్భంగా వైభవంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగిందని దేవస్థానం చైర్మన్‌ మోహన్‌ రెడ్డి, ఈవో వెంకటేశులు తెలిపారు. ఈ అక్షరాభ్యాసాలకు ఆస్థాన మండపానికి ప్రధాన దేవాలయం నుండి సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారిని, సరస్వతిదేవి అమ్మవారిని తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. 635 మంది చిన్నారులకు చైర్మన్‌, ఈవో అక్షరాలను దిద్దించారు. ఆలయ ఏఈఓ విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు పాల్గొన్నారు.

➡️