సంకల్పం ముందు వైకల్యం ఓడింది.!

Dec 25,2023 00:17
సంకల్పం ముందు వైకల్యం ఓడింది.!

చిన్నప్పటి నుంచి అతడికి క్రికెట్‌ అంటే మక్కువ. క్రీడా పోటీల్లో అంగవైకల్యం కారణంగా పాఠశాలలో తోటి విద్యార్థులు దరికి చేరనివ్వలేదు. ఎలాగైనా క్రికెట్‌ ఆడాలని తపనతో అనేక ప్రయత్నాలు చేశాడు. అతడి పట్టుదలకు అనువుగా కడప త్రిపుల్‌ ఐటీలో వీల్‌ఛైర్‌ క్రికెట్‌ ప్రాక్టీస్‌కు అవకాశం దక్కింది. దీంతో అక్కడ సాధóన చేసి ఉత్తమ ఆట తీరును ప్రదర్శిస్తూ గుర్తింపు పొందాడు. దరికి చేరనివ్వని గల్లీ క్రికెట్‌ ఆటగాళ్లకు తన ధృడ సంకల్పంతో సమాధానం చెబుతున్నాడు. దశల వారీగా జిల్లా స్థాయి నుంచి ఇంటర్నేషనల్‌ పోటీలకు ఎంపికై నేడు నేపాల్‌ జట్టుతో తలపడనున్న భారత జట్టు కీలక ఆటగాడి గణేష్‌ ప్రస్తానం ఇది..రైతు కుటుంబం నుంచి.. గణేష్‌ది చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురం మండలం తయ్యూరు గ్రామ పంచాయతీ 50 బసివిరెడ్డిపల్లి. అమర(తల్లి), సుబ్రమణ్యం(తండ్రి) దంపతులకు నలుగురు సంతానం. గణేష్‌ మూడవ కుమారుడు. పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించాడు. వ్యవసాయమే వీరి జీవనాధారం. అమ్మనాన్న కష్టంతోనే అటు చదువులోనూ.. క్రికెట్‌లోనూ ఉన్నతంగా రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు గణేష్‌.పట్టుదలతో ఇంజనీరింగ్‌ పూర్తి.. ప్రాథమిక విద్యను ఎస్‌ఆర్‌పురం మండలం 49కొత్తపల్లి మిట్టలో పూర్తి చేశాడు. ఆ తరువాత ఆరవ తరగతి నుంచి ఎన్‌ఐటీ వరకు మెరిట్‌లో పాసై ఉచితంగానే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తమిళనాడు రాష్ట్రం ఎన్‌ఐటీ తిరుచ్చిలో బీటెక్‌ పూర్తి చేశాడు. బీటెక్‌ చదువుతూ క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, డాన్స్‌లో ప్రతిభ కనబరిచాడు. కడప ట్రిపుల్‌ ఐటీలో క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసి ప్రస్తాన్నాని ప్రారంభించాడు.సెంచురీలతో చెలరేగుతూ.. వీల్‌ ఛైర్‌ క్రికెట్‌ టోర్నీలో గణేష్‌ కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉత్తమ ఆట తీరును ప్రదర్శించి గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాట్‌తో చెలరేగూతూ సెంచురీలు బాధుతున్నాడు. ఇటీవల జరిగిన తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన తెలంగాణ జట్టు 20ఓవర్లలో 8 వికెట్‌ల నష్టానికి 178 పరుగులు చేసింది. 179పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్రా జట్టులో గణేష్‌ 118 పరుగులు చేసి జట్టు విజయానికి తోడ్పాటు అందించారు. మ్యాచ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరచిన గణేష్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మ్యాచ్‌ అవార్డులను ఎంపీ భరత్‌ చేతుల మీదుగా అందుకున్నారు.స్నేహితుల తోడ్పాటు మరవలేనిది.. ”స్నేహం ముందు వైకల్యం అడ్డుకాలేదు. నా సంకల్పానికి స్నేహితుల తోడ్పాటే నున్ను అడుగడుగునా గెలిపిస్తోంది. ప్రతిభ గుర్తించి నాకు ప్రోత్సహిస్తూ మనోధైర్యాన్ని నింపుతున్నారు. చిన్ననాటి నుంచి క్రికెట్‌ ఆడాలని నేను కన్న కలలు నేరవేరడానికి మిత్రుల తోడ్పాటూ ఉంది. కోరిన చోటికి తీసుకెళ్లి సాయం చేశారు. వెన్నంటే ఉండి అన్ని తామై నిలిచారు. మనోజ్‌, శేషు, పవన్‌, వాసు, వర్మ, గుణ, సాయి, పవన్‌కుమార్‌ల సాయం జీవితంలో మరిచిపోలేను.” – గణేష్‌ప్రస్తానం ఇలా..శ్రీ 2016 డిసెంబర్‌లో కడపజిల్లా ఇడుపులపాయలో జిల్లా స్థాయి బెస్ట్‌ ప్లేయర్‌గా సెలెక్ట్‌ అయ్యాడు.శ్రీ ఏపీ ఐఐఐటి కాలేజీలో 2017 జనవరిలో స్టేట్‌ సెలక్షన్లో ఎంపికయ్యాడు.శ్రీ 2017 మార్చి హైదరాబాద్‌ ఎల్బి స్టేడియంలో నేషన ల్‌ స్టేట్‌వైజ్‌ సెలక్షన్లో ఏపీ టీంకు సెలెక్ట్‌ అయ్యారు.శ్రీ 2018 సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో స్టేట్స్‌కి ఎంపిక.శ్రీ 2019 మార్చి ఢిల్లీ రాష్ట్రంలోని ద్వారకా సిటీలో ఐపీఎల్‌కి రాజస్థాన్‌ రాజ్వాడ టీంలో ఎన్నుకున్నారుశ్రీ 2023 డిసెంబర్‌ 25 నుండి 28 వరకు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఇండియాకి నేపాల్‌కి జరగనున్న దివ్యాంగుల ఇంటర్నేషనల్‌ టి20 సీరియస్‌కి ఎంపికయ్యారు

➡️