హోంగార్డ్‌కు ఉన్నతాధికారుల పరామర్శ

Jan 27,2024 22:25
హోంగార్డ్‌కు ఉన్నతాధికారుల పరామర్శ

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఈ నెల 24వ తేదీన ఇంటి తగాదాలు కారణంగా మరిది చేతిలో గాయపడిన హోమ్‌ గార్డ్‌ సల్మాను శనివారం కర్నూల్‌ రేంజ్‌ హోంగార్డ్‌ కమాండెంట్‌ మహేష్‌, సౌత్‌ రేంజ్‌ హోంగార్డ్‌ డిఎస్‌పి చిరంజీవి, చిత్తూరు హోంగార్డ్‌ ఆర్‌ఐ భాస్కర్‌లు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సల్మాను పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెండవ పట్టణ ఇన్స్పెక్టర్‌ ఉలసయ్యతో కేసు పూర్వాపరాల గురించి అడిగి తెలుసుకొని కేసును త్వరితగతిన పూర్తిచేయాలని గాయపడిన సల్మాకు భరోసా ఇస్తూ డిపార్ట్మెంట్‌ తరపున ఎటువంటి సహాయం కావాలన్న తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేశారు.

➡️