17వ రోజూ అంగన్వాడీల సమ్మె

Dec 28,2023 22:10

పోస్టు కార్డులతో వినూత్న నిరసన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
చిత్తూరు సిడిపిఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. గురువారం 17వ రోజు సమ్మె సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానానికి నిర్లక్ష్య వైఖరికి మొండి వైఖరికి వ్యతిరేకంగా చిత్తూరులోని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పోస్ట్‌ ఉద్యమాన్ని చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి, సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కే.ప్రభావతి, కే.సుజిని, బుజ్జి, అరుణ, నాయకత్వం వహించారు. అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర సంఘాల నాయకత్వాన్ని ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్చలకు ఆహ్వానించి చర్చించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. కుప్పం: కుప్పం ప్రాజెక్టులో 17వ రోజు అంగన్వాడీ సమ్మె సందర్భంగా గురువారం పోస్టు కార్డుల ఉద్యమాన్ని యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ అంగన్వాడీల సమస్యలపై అపద్దాల ప్రచారం చేయడానికి తీవ్రంగా ఖండించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పుదారి పట్టించే పద్ధతుల వ్యవహరించడం దుర్మార్గమన్నారు. మంత్రుల కమిటీ అంగన్వాడీల సమస్యలను సీఎం దష్టికి మేమంతా తీసుకెళ్లలేదని చెప్పడం దుర్మార్గమన్నారు. ఈ పోరాటాన్ని ఉధతం చేస్తామని తప్ప వెనక్కి తగ్గేది లేదని పిలుపునిచ్చారు. రోజురోజుకి అంగన్వాడీ ఉద్యమానికి మద్దతు పెరుగుతున్నదని దీన్ని చూసైనా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. సమస్యలు పరిష్కారం కాకుండా సమ్మె విరమించేది లేదని ఇలాంటి బెదిరింపులు అంగన్వాడీ ఉద్యమం ఎన్నో చూసిందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోతే జనవరి 3న కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్వేటినగరం: స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని కార్వేటినగరం, వెదురుకుప్పం, శ్రీరంగారాజ పురం మండలాలకు చెందిన అంగన్వాడీలు గురువారం 17వ రోజు పోస్ట్‌ కార్డులతో నిరసన తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి మమతా, ఏఐటియుసి రాధమ్మలు మాట్లాడుతూ తమ సమ్మెకు మద్దతు తెలిపిన పార్టీల నాయకులకు కతజ్ఞతలు తెలియజేశారు. యూనియన్‌ నాయకులు రాణి, నాగమ్మ, వల్లెమ్మ పాల్గొన్నారు. శాంతిపురం: జనవరి 3న జరిగే కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపునిచ్చారు. గురువారం శాంతిపురం ప్రాజెక్టులో 17వ రోజు అంగన్వాడి సమ్మె సందర్భంగా పోస్టు కార్డుల ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు శోభ, ఎర్రమ్మలతోపాటు అంగన్వాడీలు పాల్గొన్నారు పలమనేరు: స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 17 రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా పోస్టుకార్డుల ద్వారా ముఖ్యమంత్రికి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించారు. కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియు నాయకులు గిరిధర్‌ గుప్తా, మద్దెల సుబ్రహ్మణ్యం, అంగన్వాడీలు జ్యోతి, శాంతి, భారతి, పద్మావతి పాల్గొన్నారు. యాదమరి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని కనుక జనవరి 3వ తేదీ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడిస్తామని అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు షకీలా తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని యాదమరి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట 17వ రోజు సమ్మె కొనసాగించారు. ఈసందర్భంగా పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. బైరెడ్డిపల్లి: మండల సెక్టార్‌ పరిధిలోని అంగన్వాడీల సమ్మె గురువారం 17వ రోజూ కొనసాగింది. ఈసందర్భంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియు నాయకులు ఆధ్వర్యంలో అంగన్వాడీలు పోస్టు కార్డుల ద్వారా తమ డిమాండ్లను ముఖ్యమంత్రికి తెలిపే ఉద్యమం ప్రారంభించారు. సమ్మెలో అంగన్వాడీలు శంకుతల, సరోజ, బిఆర్‌.నిర్మల, తిప్పక్క, ముని వెంకటమ్మ, రజిని, నాగవేణి, మంగమ్మ, ఉమా పాల్గొన్నారు.మంత్రి రోజా ఇల్లు ముట్టడి నగరి: రాష్ట్ర మంత్రి రోజ సెల్వమని ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు, కార్మిక సంఘాల నాయకులు ముట్టడి చేశారు. అంగన్వాడీ సమస్యల పట్ల జగన్మోహన్‌ రెడ్డి నిర్లక్ష్య వైఖరి నశించాలని, జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని నినాదాలు చేశారు. దీంతో పెద్దసంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్‌లు మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో వైయస్సార్‌ పార్టీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం మంత్రి ఆఫీసులో వినతిపత్రం ఇచ్చారు. నాయకులు వెంకటేశు, పెరుమాళ్‌, వేలన్‌, బాష, అంగన్వాడీలు ధనకోటి, పంచవర్ను, కస్తూరి, విజయ ఉమా, కళ, మైధిలి, షీలా, షర్మిల, భవాని, చాముండేశ్వరి పాల్గొన్నారు.

➡️