మాజీ వి.ఎం రామానుజులు నాయుడు మృతి

Apr 1,2024 12:38 #Chittoor District

టిడిపి నాయకులు నివాళి
ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం నల్లవెంగలపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు సుధాకర్ నాయుడు తండ్రి మాజీ విఎం రామనుజులునాయుడు(100) ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి దేహానికి సోమవారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం టిడిపి మండల అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ మోహన్ మురళి నియోజకవర్గం టిఎన్టిసి అధ్యక్షులు గాలి బాబు నాయుడు పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, నాయకులు వెంకటాద్రి నాయుడు, బాలాజీ, నాయుడు శేషాద్రి నాయుడు తదితరులు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

➡️