స్మశానంలో క్షుద్ర పూజలు

Apr 3,2024 11:13 #Chittoor District

భయాందోళనలో స్థానికులు

ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలోని మెదవాడ పంచాయతీ పరిధిలో మర్రిపల్లి స్మశాన వాటికలో ఎవరు గుర్తు తెలియని మాంత్రికులు క్షుద్ర పూజలు చేశారు. చూసినా స్థానికులు భయాందోళన గురైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానికుల కథనం మేరకు… ఎస్ఆర్ పురం మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి కాలువ పని చేయడానికి అటువైపు వెళ్ళగా కాలువ పక్కనే ఉన్న స్మశానం వాటికలో ఎవరో గుర్తు తెలియని మాంత్రికులు స్మశానంలో ఓ మృతుని ఖననం చేసిన ప్రదేశంలో మానవ ఆకారంలో ఉన్న బొమ్మ ను తీర్చిదిద్ది రంగులు చల్లి చూసేటందుకు ఆ బొమ్మ భయానకంగా ఉన్నట్లు తీర్చిదిద్దారు. ఆ బొమ్మకు తలపై మోచేయి కీళ్లు మోకాళ్లు తదితర ప్రాంతాలలో మేకులు దించి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు స్కూలు విద్యార్థులు చిన్నపిల్లలు అటువైపుగా వెళ్లాలంటే భయపడుతున్నారు.
గతంలో కూడా ఇదే ప్రదేశంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించారు. రోడ్డు పక్కనే ఇలా క్షుద్ర పూజలు చేయడం పోలీసుల నిఘా వైఫల్యమే అని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి సంఘటన పునరావతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు.

➡️