నేచురల్ ఫార్మింగ్ వర్కర్స్ కి 16 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలి : సిఐటియు

Jun 18,2024 16:26

ఒకే పనికి ఒకే వేతనం ఇవ్వాలి

కలెక్టర్ కి సిఐటియు వినతి

 ప్రజాశక్తి ‌- చిత్తూరుజిల్లా :   రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చిత్తూరు జిల్లా నేచురల్ ఫార్మింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని మంగళవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజాదర్బార్ లో కలెక్టర్ కి సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎం.పి.కమ్యూనిటి నేచురల్ ఫార్మింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, కోశాధికారి హనుమంత్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భారతి లు మాట్లాడుతూ 16 నెలలుగా జీతాలు రాకపోతే వారి కుటుంబాలు ఎలా జీవనం సాగిస్తున్నారు అని ప్రశ్నించారు. అదే విధంగా ఒకే రకమైన పని చేస్తున్నా వేతనాలు ఇవ్వడంలో తారతమ్యాలు చూపడం దారుణం. ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సెలవులు మంజూరు చేయాలని, ప్రమాద భీమా సౌకర్యం ఇవ్వాలని, ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పని చేయించుకుని నట్టేట ముంచడం సిగ్గు చేటన్నారు. కొత్త ప్రభుత్వం బకాయి వేతనాలు ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలన్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తాను : కలెక్టర్ హామీ

నేచురల్ ఫార్మింగ్ వర్కర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని, జిల్లా పరిధిలో వుండే వాటిని నేను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ స్పందనకు కార్మికులు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నేచురల్ ఫార్మింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మురళి సుబ్రహ్మణ్యం భాస్కర్ రెడ్డి వెంకటేష్ లతో పాటు కార్మికుల పాల్గొన్నారు.

➡️