సిఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి

Feb 13,2024 16:56 #cm jagan, #cm jagan tour, #Kurnool
  • 7 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు
  • భద్రత ఏర్పాట్లు పరిశీలించిన డిఐజి,ఎస్పీ

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : 15న సిఎం జగన్‌ కర్నూలు రాక సందర్భంగా భద్రత పరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కర్నూలు రేంజ్‌ డిఐజి సిహెచ్‌. విజయరావు, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎమ్మిగనూరు శాసన సభ్యులు చెన్నకేశవ రెడ్డి మనవడు పవన్‌ కళ్యాణ్‌ రెడ్డి వివాహామునకు ముఖ్యమంత్రి హాజరు అవుతున్నందున కర్నూలు బళ్ళారి రోడ్డులోని కింగ్‌ ప్యాలెస్‌ గ్రాండ్‌ కన్వెన్శన్‌ పరిసరాలను , ఓర్వకల్లు ఏయిర్‌ పోర్టు లో భద్రతా పరంగా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ బందోబస్తు విధులలో అడిషనల్‌ ఎస్పీ ఒకరు , 4 గురు డిఎస్పీలు, 16 మంది సిఐలు, 17 మంది ఎస్సైలు, 63 మంది ఎఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్ళు, 130 మంది కానిస్టేబుళ్ళు , 18 మంది మహిళా పోలీసులు, 70 మంది హౌంగార్డులు , ఇతర జిల్లాల నుండి అడిషనల్‌ ఎస్పీ ఒకరు, 5 మంది డిఎస్పీలు, 9 మంది సిఐలు, 30 మంది ఎస్సైలు, 50 మంది ఎఎస్సైలు మరియు హెడ్‌ కానిస్టేబుళ్ళు, 110 మంది కానిస్టేబుళ్ళు, 18 మంది మహిళా పోలీసులు, 50 మంది హౌంగారులు , 3 స్పెషల్‌ పార్టీలు, 97 మంది ఎఆర్‌ పోలీసులు బందోబస్తు విధులలో పాల్గొంటారని తెలిపారు. హెలిప్యాడ్‌ , వాహనాల పార్కింగ్‌, తదితర ఏర్పాట్లకు సంబంధించి సమన్వయంతో పని చేయాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వచ్చే ముఖ్యమైన రహదారులను, రూట్‌ బందోబస్తులను పరిశీలించారు. పోలీసు అధికారులకు సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను చేశారు.ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవ తేజ, అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ నాగరాజు, కర్నూలు సబ్‌ డివిజన్‌ డిఎస్పీ విజయ శేఖర్‌, ట్రైనీ డిఎస్పీ భావన, సిఐలు నాగరాజు యాదవ్‌, శ్రీనివాస రెడ్డి, శంకరయ్య మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️