152 మంది సెక్టార్ అధికారుల నియామకం : జిల్లా కలెక్టర్

Dec 9,2023 12:38 #Krishna district
collector on elections officers team

ప్రజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : ఎన్నికల విధులకు సంబంధించి కృష్ణాజిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాలకు 152 సెక్టార్లు మొత్తం 1763 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 152 మంది సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోకవర్గానికి సంబంధించి 26 సెక్టార్లకు 306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటికి సంబంధించి 26మంది సెక్టార్ అధికారులను, సెక్టార్ పోలీస్ అధికారులను నియమించారు. గుడివాడ నియోజకవర్గంలో 24 సెక్టార్లకు 230 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటికి సంబంధించి 24 మంది సెక్టార్ అధికారులను నియమించారు. అలాగే పెడన నియోజకవర్గానికి సంబంధించి 22 సెక్టార్లకు 216 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 22 మంది సెక్టార్ అధికారులను నియమించారు.ఇక మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి 16 సెక్టార్లకు 202 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటికి 16 మంది సెక్టార్ అధికారులను నియమించారు. అవనిగడ్డ నియోజకవర్గం సంబంధించి మొత్తం 30 సెక్టార్లకు 267 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటికి 30 మంది సెక్టార్ అధికారులను నియమించారు. పామర్రు నియోజకవర్గానికి సంబంధించి 19 సెక్టార్లు, 238 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటికి 19 మంది సెక్టార్ అధికారులను నియమించారు. చివరిగా పెనమలూరు నియోజకవర్గంకు సంబంధించి 15 సెక్టార్లు ఉన్నాయని వాటికి సంబంధించి 304 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 15 మంది సెక్టార్ అధికారులను నియమించారు.

➡️