తాగునీటి చెరువులు నూరుశాతం నింపాలి : కలెక్టర్‌ 

Apr 12,2024 23:59

ప్రజాశక్తి-గుంటూరు : నాగార్జున సాగర్‌ కుడి కాల్వ, కృష్టా పశ్చిమ డెల్టా కాల్వకు విడుదల చేసిన నీటి ద్వారా జిల్లాలో తాగునీటి చెరువులను నూరు శాతం నింపేలా ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, పంచాయితీరాజ్‌, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. దీనిపై మండల, మున్సిపల్‌ అధికారులతో కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్పరెన్స్‌ ద్వారా శుక్రవారం సమీక్షించారు. తాగునీటి అవసరాల కోసం ఏప్రిల్‌ 17వ తేది వరకే నీటిని విడుదల చేస్తారని, షెడ్యూలు ప్రకారం చెరువులు నింపేలా పర్యవేక్షించాలని, నీటిని పంటలు, ఇతర అవసరాలకు మళ్లించకుండా ఇరిగేషన్‌ ఇంజనీర్లు, మండల, గ్రామస్థాయి అధికారులతో నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. కెనాల్‌ నీటి సరఫరాను డ్రోన్‌ కెమెరాల ద్వారా తరుచు పరిశీలించాలన్నారు. తాగునీటి పథకాలకు ఆకస్మాత్తుగా వచ్చే రిపేర్లును తక్షణమే మరమ్మత్తులు చేసేలా అవసరమైన సిబ్బందిని, పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

➡️