రైతులపై కాల్పులను ఖండిస్తూ .. కాకినాడలో రైతు, కార్మిక సంఘాల నిరసన

కాకినాడ : ఢిల్లీలో రైతులపై కాల్పులను ఖండిస్తూ … రైతు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఉదయం కాకినాడలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ … పంటకు మద్దతు ధర చట్టం చేయాలని, రెండేళ్ల క్రితం రైతులకు క్షమాపణలు చెపుతూ మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రెండవ దఫా రైతాంగం మొదలుపెట్టిన ఉద్యమంపై హర్యానా బిజెపి ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించడం వల్ల 23 ఏళ్ల యువ రైతు మృతి చెందిన ఘటనపై బిజెపి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ… ధ్వజమెత్తారు.

➡️