ఎపి రజక వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్మెంట్‌ డైరెక్టర్‌కు ఘనసత్కారం

Feb 4,2024 14:36 #Konaseema

ప్రజాశక్తి- మామిడికుదురు(కోనసీమ) : ఆధుర్రు లో సీతారామ రజక సంఘం ఆధ్వర్యంలో బల్లల పూజ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎపి రజక వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్మెంట్‌ డైరెక్టర్‌ బోర్రపాలేపు సత్యనారాయణను పసుపులేటి మహాలక్ష్మి రావు, కోటిపల్లి సాయిబాబు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల కార్యదర్శి కాట్రేనిపాడు నాగేంద్ర, ఆదుర్రు రజక సంఘం ప్రెసిడెంట్‌ ఆదుర్తి జానకిరామయ్య , కోటిపల్లి శ్రీనివాస్‌ , రామేశ్వరం సుబ్రహ్మణ్యం , కందివలస అప్పారావు, మొగలికుదురు వీర రాఘవులు, ఆదుర్రు కొండయ్య , ఆదుర్రు నరసింహమూర్తి, తెల్లాకుల శ్రీనివాస్‌, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

➡️