ఆదరించండి-అభివృద్ధి చేసి చూపిస్తా : కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లెల పవన్‌

May 2,2024 11:27 #Congress candidate, #pracharam

ప్రజాశక్తి – రామసముద్రం (రాయచోటి-అన్నయమ్య) : ప్రజలు ఆదరించి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్ధి మల్లెల పవన్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని మినికి, రాగిమాకులపల్లి, చోక్కాండ్లపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పవన్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తమపై ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్‌ తోనే సాధ్యమన్నారు. తాను దాదాపు పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎలాంటి పదవి లేకుండా ఫౌండేషన్‌ స్థాపించి ప్రజలకు సేవ చేశానని అన్నారు. గుడి, బడులకు తన వంతు సహాయ సహకారాలు అందించానని చెప్పారు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలు తనను కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులుగా గెలిపించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో లక్షల మంది ప్రజలను తాను స్వయంగా కలిశానన్నారు. మదనపల్లి నియోజకవర్గం గత పాలకుల వలన పది సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిపోయిందని అన్నారు. తనను శాసనసభ్యులుగా గెలిపించి మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్ధిని కూడా గెలిపించాలని ప్రజలను అభ్యర్తించారు. ఈ కార్యక్రమంలో కొండూరు శ్రీనాథ్‌ రెడ్డి, బాలు రెడ్డి, నియోజకవర్గ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️