మతోన్మాదశక్తుల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు

చిత్తూరు : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా చిత్తూరు అంబేద్కర్‌ విగ్రహానికి సిపిఎం ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …. దేశానికి దశ దిశ నిర్దేశించిన డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం వలన దేశంలో ప్రజాస్వామ్యం నిలబడిందని, లౌకికదేశంగా కొనసాగుతున్నదని తెలిపారు. ప్రపంచంలోనే ఆదర్శవంతంగా భారతదేశం ప్రజాస్వామ్యం కొనసాగుతున్నదని తెలిపారు. ఇలాంటి రాజ్యాంగం వలన దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు ,స్వేచ్ఛ, సౌభ్రాతత్వం కల్పించబడ్డాయి. కుల నిర్మూలన కోసం కృషి చేసిన అంబేద్కర్‌ గొప్ప రాజ్యాంగాన్ని దేశంలోని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం రద్దుచేసి ఆర్‌ఎస్‌ఎస్‌ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నదని దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కులం మతాలకతీతంగా సమసమాజం కోసం కఅషి చేసిన గొప్ప మేధావి .ఇలాంటి గొప్ప మేధావి ఎన్నికల సందర్భంగా బిజెపి స్మరించుకోవడం తప్ప బిజెపి ఆయన మాట్లాడుతూ రచించిన రాజ్యాంగాన్ని ఎందుకు రద్దు చేస్తున్నది సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నేడు దేశంలోనూ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కన్న కలలు నెరవేరాలంటే ఎన్నికల్లో మతోన్మాద శక్తులకు దాన్ని బలపరుస్తున్న వారికి తగిన బుద్ధి ఓటు ద్వారా చెప్పినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక హౌదా ఇవ్వకుండా ద్రోహం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సురేంద్రన్‌, చిత్తూరు నాయకులు అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు

➡️