తుఫాన్ బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి : సిపిఎం

Dec 6,2023 15:49 #Guntur District
cpm visit cyclone effected areas mangalagiri

ప్రజాశక్తి-మంగళగిరి : మూడు రోజులుగా తుఫాను వలన కురిసిన వర్షాలు వలన ఉపాధి కోల్పోయిన బాధితులకు వెంటనే ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని, బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ ఎస్ చంగాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మంగళగిరి పట్టణ పరిధిలోని రత్నాల చెరువులో వర్షాలు వల్ల ముంపు గురైన ప్రాంతాలను సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా చేంగాయ్య మాట్లాడుతూ వెంటనే నీళ్లు మళ్లించే చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం, బియ్యం పంపిణీ చేయాలని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులను ఆదుకోవాలని అన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్ మాట్లాడుతూ తుఫాన్ బాధితులందరికీ నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ, పట్టణ నాయకులు టి శ్రీరాములు, అన్వర్ ఖాన్, సిఐటియు నాయకులు జె నవీన్ ప్రకాష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎన్ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

➡️