కోతకొచ్చిన పంట పూర్తిగా నీటిపాలు

Dec 6,2023 13:31 #Guntur District
cyclone effected in ap amaravati

రైతు సంఘ నాయకులు కన్యధార వసంతరావు

ప్రజాశక్తి-అమరావతి : నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు వంకలు కలసి పంట పొలాలపై ప్రవహించి,పంటను పూర్తిగా దెబ్బతీసాయని టిడిపి రాష్ట్ర రైతు సంఘం నాయకులు కన్యధార వసంతరావు అన్నారు. బుధవారం ఆయన అమరావతి మండలంలోని పలు ప్రదేశాల్లో నీటి పంట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఎండ్రాయి నరుకులపాడు ఉంగుటూరు ఊటుకూరు బయ్యవరం ప్రాంతాల్లోని వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని ఆయన అన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. పత్తి పొలాల్లో ఒక్కో ఎకరంలో ఐదు ఆరు క్వింటాలు పత్తి తీసేందుకు ఉందని అకాల వర్షంతో తుఫాను ప్రభావం చూపి పత్తి మొత్తం నైట్ మునిగిపోయిందని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వరిచేలు కోతకు వచ్చి సిద్ధంగా ఉన్న పంట మొత్తం పూర్తిగా నీటిపాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఎకరాకి 50 వేల రూపాయల నష్టపరిహారం అందించాలని వసంతరావు కోరారు.

➡️