తుఫాను ప్రభావంతో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

cyclone effected in ap rajavommangi

రాకపోకలకు అంతరాయం పలు చోట్ల నీట మునిగిన గ్రామాలు
కొట్టుకుపోయిన కాల్వర్టులు నీటమునిగిన వరిచేలు.

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మీచాంగ్ తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ఒట్టిగడ్డ, గింజర్తి, మడేరు, నెల్లిమెట్ల కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గింజర్తి, నెల్లిమెట్ల రాజవొమ్మంగి వయ్యాడు, గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి, డిమాల్లవరం గ్రామ శివారులో రహదారిపై ఉన్న కాల్వర్టు కొట్టుకుపోవడంతో గ్రామానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలోని తంటికొండ పంచాయితీ తంటికొండ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రంగా లేకపోవడంతో గ్రామంలో ఇల్లుల్లోకి వరదనీరు చేరడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలాచోట్ల వరిచేలు నీట మునిగాయి, పలుచోట్ల ఈదురుగాళ్లకు పలుచోట్ల విద్యుత్ వైర్లపై చెట్టుకొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక తాహాసిల్దార్ సుబ్రహ్మణ్య ఆచారి డిటి ఏ సత్యనారాయణ, ఎస్ఐ ఎస్ వెంకయ్య తదితరులు గ్రామాలను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తంటికొండ గ్రామంలో వర్షాలకు వరదనీరు గ్రామంలో చేరకుండా పటిష్టంగా కలవర్టు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

➡️