అనకాపల్లి బిజెపి అభ్యర్థి సిఎం రమేష్‌ ను ఓడించండి : సిఎం ప్రచారం

May 6,2024 11:15 #anakapalli, #CPM campaign

అనకాపల్లి : అనకాపల్లి బిజెపి అభ్యర్థి సిఎం రమేష్‌ ను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న, వి.మాడుగుల దేవరాపల్లి, సిపిఎం మండల కార్యదర్శులు పిలుపునిచ్చారు సోమవారం వాలాబు గర్సింగి పంచాయతీలో విస్తఅత ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడారు. దేశంలో జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైన ఎన్నికలని దీని ప్రాధాన్యతను ప్రజలు గుర్తించాలని తెలిపారు. సిఎం రమేష్‌ లాంటి పారిశ్రామికవేత్తలను వలస తీసుకువచ్చి అనకాపల్లి పార్లమెంట్‌ లో పోటి చేయించి బిజెపి ఎలాగైనా గెలవడం కోసం కిరాయి మనుషులు పెట్టి ప్రచారం చేయించే విష సంస్కఅతి జిల్లా లో ఏర్పడుతుందని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లా లోని వేలాది మంది కసాయి మూకలను దింపి డబ్బు మద్యం పంపకానికి సిద్ధం చేయడం జరిగిందన్నారు. దీనికి తోడు పసిపిల్లలతో ప్రచారానికి పూనుకుంటున్నారని ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని తెలిపారు. ఇలాంటి వ్వక్తులను పార్లమెంటుకు పంపిస్తే తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. మోడీ మూడవ సారి గెలిస్తే భవిష్యత్‌ లో ఎన్నికలు ఉండవని రాజ్యంగాన్ని పూర్తిగా రద్దు చేస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని అన్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోని ఎన్‌ డి ఎ కూటమిని ఓడించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు అలోచించి ఎన్‌ డి ఎ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వి.మాడుగుల దేవరాపల్లి మండల కార్యదర్శులు ఇరటనరసింహ మూర్తి, బిటి.దొర, తదితరులు పాల్గొన్నారు.

➡️