మోసం చేసిన బిజెపిని, బలపర్చే పార్టీలను ఓడించాలి

Apr 18,2024 00:11

ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌, సిపిఎం శ్రేణులు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
ఇండియా వేదిక బలపరిచిన గురజాల నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తియ్యగుర యలమందరెడ్డిని గెలిపిం చాలని కోరుతూ కాంగ్రెస్‌, సిపిఎం శ్రేణులు బుధవారం పిడుగురాళ్ల పట్టణంలో శ్రీనివాస్‌ కాలనీ, బోయ కాలనీ, వడ్డెర కాలనీ, బ్రహ్మానంద రెడ్డి కాలనీ, తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థి యలమందరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పదేళ్లిస్తామని తిరుపతిలో ప్రకటించిన బిజెపి అనంతరం ప్రజలను నట్టేసిన ముంచిందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని విమ ర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగాన్ని కాపాడుతుందని, పేదలకు సంక్షేమ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. సిపిఎం మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షిక వ్యతిరేక విధానాలను ఆలంబి స్తోందని, కార్పొరేటర్లకు దేశ సంపదను దోచిపెడుతోందని అన్నారు. మతోన్మా దాన్ని రెచ్చగొడుతూ ప్రజల్లో విభజన తెస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపిని, దానితో జతకట్టిన పార్టీలను, తొత్తుగా వ్యవహరించే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ పల్నాడు జిల్లా కో-ఆర్డినేటర్‌ జొన్నలగడ్డ యోహాను మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి మహిళను లక్షాధికారిగా చేసే బాధ్యత తీసుకుంటుందన్నారు. రైతుకు రూ.రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తుందని, ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తుందని, కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తుందని వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం తదితర కార్యక్రమాలు చేపడుతుందన్నారు. గురజాల ఎమ్మెల్యేగా తియ్యగూర యల మందరెడ్డిని, నరసరావుపేట ఎంపీగా కాంగ్రెస్‌ అభ్యర్థి అలెగ్జాండర్‌ సుధాకర్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు డి.వెంకటేశ్వర్లు, షేక్‌ బాబు, రామకృష్ణ, శ్రీను, లక్ష్మి, నాగేంద్రం, యోహాన్‌ హుస్సేన, గోవిందు పాల్గొన్నారు.

➡️