దంత వైద్య పరీక్షలు

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): దంత క్షయం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నరసాపురం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పులపర్తి ప్రతాప్ అన్నారు. శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీలో సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బాలబాలికలకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ దంత వైద్యులు డా. పిఎస్ఎన్ మూర్తి బాలబాలికలకు దంత వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా పులపర్తి ప్రతాప్ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఘంటా భాస్కరరావు ,మదర్ అండ్ చైల్డ్ కేర్ డీసీ ఝాన్సీ లక్ష్మీ ఆర్ధిక సహాయంతో టూత్ బ్రష్ లు,పేస్టులు ,చాక్లెట్లు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పులపర్తి ప్రతాప్ హాస్టల్ కి ఎల్ఈడి ఛార్జింగ్ బుల్బ్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ బాలకుమారి, పొన్నాడ సుబ్రమణ్యం, పద్మావతి, అల్లూరి బాబురావు,నళిని, హాస్టల్ అధికారి వెంకట రమణ, వార్డెన్ కనకదుర్గ, వి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

➡️