పేద ప్రజల అభివృద్దే జగనన్న లక్ష్యం : ఎమ్మెల్యే వెంకటే గౌడ

Jan 3,2024 14:58 #chitoor

ప్రజాశక్తి-వీకోట(చిత్తూరు) : పేద ప్రజల అభివద్ధే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం ముందుకు వెళ్తొందని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ప్రభుత్వం పెంచిన పించన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలో భాగంగా చెప్పిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు పెన్షన్‌ పెంచి ఆ సొమ్ము లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. గతంలో టిడిపి పాలనలో చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండేది కాదని తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వమని తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని సందర్శించి వారి సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. మండలంలో జగనన్న ప్రభుత్వం సుమారు 11,569 పెన్షన్లకు గాను 3 కోట్ల 50 లక్ష రూపాయలు చెల్లిస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2019లో 2250 రూపాయలు,2022 జనవరిలో 2,500 రూపాయలు , 2023 జనవరిలో రు.2750 , ప్రస్తుతం2024లో తాజాగా రు.3000 పెన్షన్లను పెంచి అర్హులైన వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అందజేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మరల పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ,నాయకులు, లబ్ధిదారులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యువరాజ్‌ జిల్లా పరిషత్‌ సాంఘిక సంక్షేమ సలహాలు సభ్యులు అమర్నాథ్‌ శ్రీనివాసులు గౌస్‌ రాష్ట్ర వైకాపా కార్యదర్శి పి ఎన్‌ నాగరాజు, వైస్‌ యం.పి.పి లు తమీమ్‌ ఖాన్‌, లక్ష్మణ్‌ రెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాలగురునాథ్‌,సింగిల్‌ విండో అధ్యక్షులు శ్రీరాములు రెడ్డి , గోపిరెడ్డి, నేతలు దవనం భక్త , కిషోర్‌ గౌడ్‌, శ్రీనివాసులు, పలువురు సర్పంచ్‌ లు, ఎంపీటీసీ సభ్యులు తాసిల్దార్‌ చిట్టిబాబు , ఎంపీడీవో మహమ్మద్‌ రఫీ పాల్గొన్నారు.

➡️