వైసిపితోనే గ్రామాల అభివృద్ధి

ప్రజాశక్తి-దర్శి : వైసిపితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మారెడ్డిపల్లి, చందలూరు, చందలూరు ఎస్‌సికాలనీ, బట్టువారిపల్లి, పులిమి వారిపల్లి, తుమ్మెదలపాడు గ్రామాలలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ వైసిపి అధికారంలోకి వస్తే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగినట్లు తెలిపారు. చంద్రబాబు నాయకుడి కల్లబొల్లి మాటలు చెప్పి నమ్మే పరిస ి్థతులు ప్రజలు లేరని తెలిపారు. ఈ సందర్భంగా దర్శి నగర పంచాయతీలోని శివరాజ్‌నగర్‌కు చెందిన పలువురు వైసీపీలో చేరారు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వారికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, కార్పొరేషన్‌ డైరెక్టర్లు కుమ్మిత అంజిరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, డాక్టర్‌ ఎస్‌ఎం.బాషా, వైసిపి నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.

➡️