కార్మిక సమస్యల పరిష్కారానికి ధర్నా

Jun 18,2024 16:41 #anatapuram

జాయింట్ కమిటీ ఏర్పాటుకు కమిషనర్ అంగీకారం

ప్రజాశక్తి – అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు, సిఐటియు ఒకటో నగర కార్యదర్శి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు రెగ్యులర్ కార్మికులకు బకాయి ఉన్న సరెండర్ లీవు, ఔట్సోర్సింగ్ కార్మికులకు, ఈఎస్ఐ కార్డులు, చనిపోయిన కార్మికులకు డెత్ క్లైమ్, అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి, పనిముట్లు, ఇంజనీరింగ్ కార్మికులకు, స్కిల్ సెమి స్కిల్ వేతనాలు, పిఎఫ్ ఈఎస్ఐ సమస్యలు, మలేరియా గార్బేజ్ కోవిడ్ క్లాప్ ఆటో డ్రైవర్లకు 15000 వేల రూపాయలు వేతనం చెల్లించాలని, పెరిగిన నగరానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై పలు దఫాలుగా ఆందోళన నిర్వహించిన ఇప్పటివరకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. పై విషయాల పైన మున్సిపల్ కమిషనర్ మేఘ స్వరూప్ స్పందిస్తూ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తామని అలాగే నాయకత్వంతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమoలో సిఐటియు మెడికల్ నాయకులు సురేంద్ర, రెగ్యులర్ అధ్యక్ష కార్యదర్శులు, నల్లప్ప ముతురాజు, ఇంజనీరింగ్ అధ్యక్ష కార్యదర్శులు, రాయుడు మల్లికార్జున ఓబులపతి పోతులయ్య, అవుట్సోర్సింగ్ అధ్యక్ష కార్యదర్శులు, బండారి స్వామి, సాకే తిరుమలేశు, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, కోశాధికారి భర్తల ఆదినారాయణ, లక్ష్మీనరసమ మంత్రి వరలక్ష్మి, కమిటీ సభ్యులు శ్రీనివాసమూర్తి బంగ్లా రాఘవ మరియమ్మ భవాని తదితరులు పాల్గొన్నారు.

➡️