82.5కిలోల గంజాయి పట్టివేత

గంజాయి పట్టివేత

ప్రజాశక్తి -సీలేరు: జీకే వీధి మండలం రంతాడ జంక్షన్‌ వద్ద నిర్వహించిన పోలీసు తనిఖీలలో రూ. 4.12 లక్షల విలువచేసే 82.5 కిలోల గంజాయిని పట్టుకున్నామని సిఐ అప్పలనాయుడు తెలిపారు. ఒక ఆటో, పల్సర్‌ బైకు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితుల్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సిఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలివి. ముందస్తు సమాచారం మేరకు రింతాడ జంక్షన్‌ వద్ద మంగళవారం సాయంత్రం సిబ్బందితో కాపు కాసి తనిఖీలు నిర్వహించామని, ఒక ఆటో పల్సర్‌ బైకును ఆపి, తనిఖీలు నిర్వహించగా ఆటోలో 82.5 కేజీలు గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇద్దరు నిందితుల్ని అదుపులో తీసుకుని ఆటో, పల్సర్‌ బైక్‌ రెండు టచ్‌ మొబైల్‌ ఫోన్లు రూ.720 నగదు స్వాధీనం చేసుకొని పోలీస్‌ స్టేషన్‌ తరలించామని తెలిపారు. నిందితులను విచారించగా జీకే వీధి మండలం రేంతాడ పంచాయతీ కమ్మర వీధికి చెందిన ఎం.మురగేష్‌, చింతపల్లి మండలం బురిగి సింగి గ్రామానికి చెందిన గాలి సత్యనారాయణగా గుర్తించామన్నారు. గంజాయి సరఫరా చేసిన వ్యక్తిని ఆటో డ్రైవర్‌ను అరెస్ట్‌ చేయవలసి ఉందని సిఐ అప్పలనాయుడు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహాన్‌ సిన్హా చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా పెడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్సై అప్పలసూరి పోలీసులు పాల్గొన్నారు.

అరెస్ట్‌ చేసిన నిందితులతో సిఐ అప్పలనాయుడు, ఎస్సై అప్పలసూరి, పోలీసులు.

➡️