కలెక్టరేట్ వద్ద ధర్నాస్థలి నిర్వహణకు అనుమతించాలి

Mar 13,2024 16:36 #Collectorate, #Dharna Chowk, #Kakinada
  • కలెక్టర్ కు అఖిలపక్షం వినతి

ప్రజాశక్తి కాకినాడ : కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుకునే రాజ్యాంగ హక్కులకు అనుమతించాలని జిల్లా కలెక్టర్ కృతిక్ శుక్లాను అఖిల పక్షం కోరింది. సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు చేపట్టిన దీక్షతో ప్రకటించిన హామీ ప్రకారం ఆర్ డి వో, డిఎస్ పి లతో రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల ప్రతినిధులతో సమన్వయ సమావేశాలు నిర్వహించిన చర్యలు అభినందనీయమని పుష్పగుచ్చం అందించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఎస్ పి ఎస్ సతీష్ కుమార్, అర్భన్ ఆర్ డి వో ఇట్ల కిషోర్ వేర్వేరుగా అందించే నివేదికలతో కలెక్టరేట్ వద్ద ధర్నాస్థలి నిర్వహణకు అనుమతించే చర్యలపై కలెక్టర్ నిర్ణయం వహించనున్నారు. కలెక్టరేట్ ను ఆనుకుని వున్న ముసాఫర్ వీధిని రహదారిగా మార్చి ప్రోటోకాల్ వాహనాలకు ప్రవేశం మార్గం ఏర్పాటు చేస్తే ధర్నా స్థలి వలన ఇబ్బందులుండవన్నారు. ఆనుకుని వున్న ట్రావెలర్స్ బంగ్లా నుండి మార్గం చేయవచ్చని వివరించారు. దువ్వా శేషబాబ్జీ అయినాపురపు సూర్యనారాయణ, దూసర్లపూడి రమణరాజు, వడ్లమూరి మంగాదేవి, భైవరపు పద్మావతి, బొబ్బిలి రాజేశ్వరరావు, సిద్దాంతుల కొండబాబు, రియాజ్, కృష్ణమోహన్, రాజా ,మోసా ఏసుబాబు పాల్గొన్నారు.

➡️