డిఐఈఓ ఆకస్మిక తనిఖీ

Feb 6,2024 14:49 #ongle, #Prakasam District

ప్రజాశక్తి-కంభం రూరల్ (ప్రకాశం) :  తురిమెళ్ళ ప్రభుత్వ జూనియర్ కళాశాల ను ఇంటర్మీడియట్ విద్య అధికారి ఐ.శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వివిధ రికార్డులు పరిశీలించారు. కళాశాలలో జరుగుతున్న నాడు -నేడు పనులలో భాగంగా తరగతి గదులను, నిర్మాణంలో ఉన్న బాలికల మరియు బాలుర మరుగుదొడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. నాణ్యతాయుతంగా పనులు త్వరగా పూర్తిచేయాలని కళాశాల ప్రిన్సిపాల్ కె.ప్రభాకర రెడ్డిని ఆదేశించారు.

➡️