కరువు పరిహారం ఇవ్వాలి

Feb 13,2024 16:28 #Kurnool
  • సర్వసభ్య సమావేశంలో వామపక్షల బైఠాయింపు

ప్రజాశక్తి- దేవనకొండ (కర్నూలు) : పంట నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్‌ ,సిపిఐ మండల కార్యదర్శి నరసరావులు డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మండల రైతాంగానికి చెందిన ఖరీఫ్‌ రబి సీజన్లో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం కరువు ప్రకటించి చేతులు దులుపుకుంటుంది కానీ రైతులకు పరిహారం ఇవ్వడం లేదని మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో నిరసన తెలిపి వామపక్ష పార్టీల నాయకులు బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వరుసగా కరువులు వస్తున్న ఆదుకునే నాధుడు లేదని విమర్శించారు.కరువు ప్రకటించడం చేతులు దులుపుకోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని వేలకు వేల రూపాయలు పెట్టి భారీగా నష్టం చవిచూస్తున్న రైతును విస్మరిస్తున్నారని రైతు రోజు రోజుకు అప్పుల్లో కూరుకుపోతూ తన ప్రాణాన్ని పణంగా పెడుతున్న ప్రభుత్వానికి , ప్రజాప్రతినిధులకు కనికరం రావడం లేదని విమర్శించారు.కరువు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు కరువు పరిహారం ఇవ్వకుండా రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ఇస్తుందని ఎన్నికల కోడ్‌ వస్తే పరిహారం వచ్చే అవకాశం చాలా తక్కువ అని ఇప్పటికే 2018 సంవత్సరంలో ఇట్లాంటి అనుభవం ఉందని కావున ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే రైతు ఖాతాల్లో పంట నష్టపరిహారం జమ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రజా ప్రతినిధులు కూడా రైతుల తరఫున మాట్లాడాలని ఎంతో నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజాప్రతినిధులు కూడా రైతుల తరఫున మాట్లాడకపోవడం శోచనీయమని వారు పేర్కొన్నారు. పంట నష్టపరిహారం, ఉపాధి పని కల్పన, వలసల నివారణ, పశుగ్రాసం తదితర అంశాలలో రైతులకు చేయూతగా అండగా నిలవాలని వారు కోరారు.మండలంలో సీజనల్‌ హాస్టల్‌ లేకపోవడం వలన చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యారని ఆ పాపం ప్రభుత్వానేదనని విమర్శించారు. ఈ బయటయింపు కార్యక్రమానికి టిడిపి ప్రజాప్రతినిధులు విజయ భాస్కర్‌ గౌడ్‌, భాస్కర్‌, నాగరాజుగౌడ్‌, మహేశ్వర్‌ రెడ్డి చిన్న రామప్పలు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు అశోక్‌,యూసుఫ్‌ భాషా, వెంకటేశులు రామాంజనేయులు, వీరాంజనేయులు ,పాండు పాల్గొన్నారు.

➡️