పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

Jan 24,2024 22:22
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ప్రజా ఆరోగ్య పరిరక్షణకు పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. స్వచ్ఛత మన బాధ్యత.. గుడ్‌ మార్నింగ్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన రాజమండ్రి రూరల్‌ 17వ వార్డు, ఐఒసిఎల్‌ కాలనీ, శంభు నగర్‌ కాలనీల్లో పర్యటించారు. పలు డ్రైనేజీలు, పార్కుల పరిశుభ్రత, విద్యుత్‌ దీపాలు వంటి పలు సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారం నిమిత్తం నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి వేణు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం స్వచ్ఛతతో కూడిన పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమని చెప్పారు. ఆ మేరకు సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు మెరుగైన పారిశుధ్యం కల్పించే దిశగా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఐఒసిఎల్‌ కాలనీలోని మహిళలతో మాట్లాడారు. వారు వివరించిన సమస్యల పరిష్కారానికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఎస్‌ఇ పాండురంగారావు, హెల్త్‌ ఆఫీసర్‌ ఎ.వినూత్న పాల్గొన్నారు.

➡️