ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్ష

Feb 25,2024 23:34
గ్రూప్‌-2

జిల్లా వ్యాప్తంగా 53 కేంద్రాల్లో నిర్వహణ
84 శాతం మంది హాజరు
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌
జిల్లాలో ఆదివారం జరిగిన గ్రూప్‌-2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో గ్రూప్‌-2 పరీక్షా కేంద్రాలని జెసి తేజ్‌భరత్‌తో కలిసి ఆమె పరిశీలించారు. విఎల్‌.పురంలోని శ్రీచైతన్య జూనియర్‌ కాలేజిలో పరీక్షా కేంద్రాన్ని డిఆర్‌ఓ నరసింహులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 53 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్‌-2 పరీక్ష జరిగిందన్నారు. 18,501 మంది అభ్యర్థులకు 15,709 మంది హాజరయ్యారన్నారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో 35 కేంద్రాల్లో, కొవ్వూరు డివిజన్‌లో 18 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారన్నారు. తాళ్లపూడి : తాళ్లపూడి మండలంలో 720 మందికి 564 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కేంద్రాల వారీగా వేగేశ్వరపురం జిల్లా పరిషత్‌ ఉనత పాఠశాలలో 260 మంది విద్యార్థులకు 208 మంది తాళ్లపూడి లో కరి బండి డిగ్రీ కళాశాల లో 240 మంది విద్యార్థులకు 179 మంది శ్రీ పరసపద్మ రాజారావు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 240 మంది విద్యార్థులు గాను 177 మంది పరీక్షలకు హాజరయ్యారు. తాళ్లపూడి ఎంపిడిఒ రమణ తహశీల్దార్‌ శ్రీనివాసరావు, ఎఎస్‌ఒ జోడాల వెంకటేశ్వరరావు, గోపాలపురం డిప్యూటీ తాసిల్దార్‌ కష్ణ లైజన్‌ ఆఫీసర్లుగా వ్యవహరించారు.

➡️