ప్రతి రౌండ్లో 14 టేబుల్స్ లలో ఓట్లు లెక్కింపు

May 23,2024 12:48 #East Godavari

– జిల్లా ఎన్నికల అధికారి డా కె.మాధవీలత

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 08- రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో అసెంబ్లి నియోజక వర్గాల వారీగా ఏడు అసెంబ్లి, ఒక పార్లమెంటు నియోజక వర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4 వ తేదీ నన్నయ్య యూనివర్సిటీ లో నిర్వర్తించడం కోసం తగిన మానవ వనరులు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.

గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెలగపూడి నుంచీ జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాలో చేపట్టనున్న ప్రణాళికలు కలెక్టర్ మాధవీలత వివరించారు.
మే 13న జిల్లా వ్యాప్తంగా 1577 పోలింగు కేంద్రాలలో పోలింగు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 16,23,149 మంది ఓటర్లలో 13,13,630 మంది (80.93%) మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. జూన్ 4 వ తేదిన ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ కోసం ప్రతి రౌండ్ లో అసెంబ్లి, పార్లమెంటు నియోజక వర్గాల వారీగా విడివిడిగా 14 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందు కోసం ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, సహయ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్స్ పర్యవేక్షణలో ఈ. వి. ఎమ్. లలో నిక్షిప్తం అయిన ఓట్లను అభ్యర్ధులు లేదా వారు ప్రతిపాదించిన ఏజెంట్స్ సమక్షం లో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. రాష్ర్టంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నలుగురు ఎన్నికల పరిశీలకులు రాష్ట్రానికి కేటాయించడం జరిగిందన్నారు.

ఈ వి ఎమ్ లు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు ద్వారా కౌంటింగ్ కేంద్రాలకు పోలీసు రక్షణ , కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య తరలించి, కౌంటింగ్ పూర్తి అయిన తరువాత తిరిగి అక్కడ భద్రపరచడం జరుగుతుందనీ మాధవీలత తెలిపారు.
నియోజక వర్గాల వారీగా అసెంబ్లి మరియు పార్లమెంటు నియోజక వర్గాల కౌంటింగ్ చేసే విధానం.. రౌండ్ వారీగా 14 పి ఎస్ లకు చెందిన ఈ వి ఎమ్ చొప్పున అసెంబ్లి నియోజక వర్గ, పార్లమెంటు నియోజక వర్గ పొలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు సమాంతరంగా చేపట్టడం జరుగుతుంది.

40- అనపర్తి 228 పోలింగు కేంద్రాలు.. 16 రౌండ్లు, చివరి 17 వ రౌండ్ లో నాలుగు పి. ఎస్. లు

49- రాజానగరం 216 పోలింగు కేంద్రాలు..15 రౌండ్లు, చివరి రౌండ్ లో ఆరు పి ఎస్ లు

50- రాజమండ్రి సీటీ 237 పోలింగు కేంద్రాలు 16 రౌండ్లు, చివరి రౌండ్ లో  13 పి ఎస్ లు

51- రాజమండ్రి గ్రామీణ 267 పోలింగు కేంద్రాలు 19 రౌండ్లు, చివరి రౌండ్ లో  ఒక పి ఎస్

54- కొవ్వూరు (ఎస్ సి)  176 పోలింగు కేంద్రాలు 12 రౌండ్లు, చివరి రౌండ్ లో  ఎనిమిది పి ఎస్ లు

55- నిడదవోలు  205 పోలింగు కేంద్రాలు 14 రౌండ్లు, చివరి రౌండ్ లో  తొమ్మిది పి ఎస్ లు

66- గోపాలపురం (ఎస్ సి) 248 పోలింగు కేంద్రాలు 17 రౌండ్లు, చివరి రౌండ్ లో పది పి ఎస్ లు

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం…

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ లో భాగంగా పార్లమెంటు నియోజక వర్గానికి పోలైన పి బి ఓట్ల ను ప్రత్యేకంగాను, అసెంబ్లి కి చెందిన ఓట్లను ఆయా అసెంబ్లి నియోజక వర్గాల కౌంటింగ్ కేంద్రాలలో చేపట్టడం జరుగుతుందని మాధవీలత తెలియ చేశారు. పార్లమెంటు / అసెంబ్లి నియోజక వర్గ అభ్యర్థులకు పోలైన పోస్టల్ బ్యాలెట్ వివిధ దశల్లో స్క్రూటిని చెయ్యడం జరుగుతుందనీ తెలిపారు.

స్క్రూటినీ చేసే ప్రక్రియ :

13C (Form – C)  కవర్ పై  సంతకం మరియు అసెంబ్లీ/ పార్లమెంట్ ఏది అయితే అది రాయాలి. అలా రాసిన వాటినీ ఓట్ల లెక్కింపు కోసం తొలుత ఎంపిక చేయ్యడం జరుగుతుంది.

తదుపరి 13A(Form -A) ఓటరు వివరాలు మరియు గెజిటెడ్ అధికారి సంతకం ఉంటుంది. వాటినీ నిర్దారణ చేసుకోవడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం తదుపరి దశకి పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుంది.

13B (Form – B) బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ ను పరిశీలించి.. వ్యాలిడిటీ వాటినీ పోస్టల్ బ్యాలెట్ లో ఎవరికైతే ఓటు వేసొరో అందుకు నిర్దేశించిన పిజియన్ బాక్స్ లో, పోలైన ఓట్లు, ఇన్వాలిడ్, నోటా ఆయా నిర్దేశించిన బాక్సుల్లో లెక్కింపు కోసం పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుంది.

పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొరకు అర్హత కలిగిన వాటిని 500 ఓట్లు ఒక కట్టగా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ప్రత్యేకంగా కేటాయించిన కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేసి పార్లమెంటు సభ్యులకి పాలైన ఓట్లను ముందుగా లెక్కించనున్నట్లు తెలిపారు. అదే విధంగా అసెంబ్లి నియోజక వర్గ కౌంటింగ్ ఆయా కౌంటింగ్ కేంద్రాలలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభం చెయ్యడం , తదుపరి ఈ వి ఎమ్ ఓట్ల ను లెక్కించనున్నట్లు తెలియ చేశారు. ఇందు కోసం ప్రత్యేకంగా 4 / 5 టేబుల్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

➡️