గ్రామాల కూడలిలో చలివేంద్రం

Apr 17,2024 22:24
గ్రామాల కూడలిలో చలివేంద్రం

ప్రజాశక్తి-తాళ్లపూడిఏ సమయంలోనైనా ప్రజల దాహార్తిని తీర్చాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరి పైనా ఉందని పలువురు వక్తలు అన్నారు. మండుతున్న ఎండలు, వేసవిని దృష్టిలో ఉంచుకుని మండలంలోని పెద్దేవం సినిమా హాల్‌ సెంటర్‌ వద్ద మూడు గ్రామాలను కలిపే కూడలిలో పలు సేవా సంస్థలు మంచినీటి చలివేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సేవా సంస్థల ప్రతినిధులు మల్లిపూడి హనుమంతు, ఘనసాల ఆకాష్‌, కొనగల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️