మతం పేరుతో మోడీ రాజకీయం

May 18,2024 21:22
మతం పేరుతో మోడీ రాజకీయం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఏ ఒక్క మంచి పనీ చేయలేదని, ఓడిపోతున్నామని తెలిసి నరేంద్ర మోడీ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో ప్రజలను మభ్యపెట్టడానికి మోడీ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని కులాన్ని మతాన్ని ఉపయోగించి ఓట్లు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన మూడూ మోడీకి వంత పాడుతున్నాయన్నారు. చంద్రబాబు, పవన్‌, జగన్‌కు మోడీపై ప్రేమ లేదని, ఏదో కేసు పేరుతో జైల్లో వేస్తారని భయం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పోలీసుల సాయంతో ఎన్నికలు నిర్వహించాలని, ప్రతిపక్షాలను భయపెట్టాలని చూశారన్నారు. కొత్త ఇసుక పాలసీ అమలు చేస్తానని చెప్పిన జగన్‌ లక్షలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డుని పడేశారన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు, నగర కార్యదర్శి వి.కొండలరావు, కె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️