ప్రచారానికి తెర…

May 11,2024 22:34
ప్రచారానికి తెర...

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి సార్వత్రిక ఎన్నికలకు ప్రచార ఘట్టం ముగియడంతో ప్రలోభాల పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు నుంచే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించిన విషయం విదితమే. ఎన్నికల ప్రకటన ఊరూ… వాడా మైకులతో హోరెత్తాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల పర్యటనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనల మేరకు ప్రచార కార్యక్రమాలకు తెరదించారు. 6 గంటల తర్వాత ఎటువంటి ప్రచారానికి, ర్యాలీలు నిర్వహించడానికి, మైకుల ద్వారా ప్రచారం చెయ్యడానికి వీల్లేదని ప్రకటించడంతో అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది, పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్లు, 200 మీటర్ల దూరం వరకు నిర్ధేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి. ఓటరు స్లిప్స్‌ పంపిణీ చేసే విధానంలో ప్రచారానికి అవకాశం లేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే బైండోవర్‌ కేసులు నమోదు చేస్తామంటూ ఇప్పటికే ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి ముందస్తుగా రాజకీయ పార్టీల ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించరాదు. మార్చి 16 నుంచి జూన్‌ 6వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుంది.ఓటుకు నోటు ఎరప్రచార పర్వం ముగింపు దశకు చేరుకోవడంతో అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెర లేపారు. ఓటుకు నోటు ఎర వేసి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. జిల్లా కేంద్రమైన రాజమండ్రి సిటీ, రూరల్‌ నియోజక వర్గాల్లో నగదు పంపిణీ తార స్థాయికి చేరింది. వైసిపి, టిడిపి కూటమి పార్టీల అభ్య ర్థుల తరుపున కొందరు ప్రైవేటు వ్యక్తులు ఓటుకు రూ.2500 చొప్పున పంపిణీ చేశారు. రాజమండ్రిలో నికరంగా 50 వేల ఓట్లు కొనుగోలే లక్ష్యంగా ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి వరకూ కొనుగోలు ప్రక్రియ కొన సాగింది. ఓట్ల కొనుగోలు నిమి త్తం రెండు పార్టీ లూ సు మారు రూ.50 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఓటరుకు రూ.వెయ్యి మాత్రమే ఇవ్వ డంతో ఘర్షణలు పరి పా టిగా మా రాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన కాలనీల్లో పంపిణీ నిలిచిపోయింది. పోస్టల్‌ ఓట్లకు రూ.3 వేలు ఇచ్చిన విషయం విదితమే. ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో మధ్యవర్తుల చేతి వాటం అభ్యర్థులకు తలపోటులా మారింది.కుల సంఘాలకు రూ.4 నుంచి రూ.6 లక్షలుపోలింగ్‌ సమీపిస్తుండడంతో రాజకీయపార్టీల అభ్యర్థులు సామాజిక వర్గాల ఓటర్లకు గేలం వేసే పనిలో పడ్డారు. ప్రధాన సామాజిక వర్గాలపై కన్నేశారు. ఈ మేరకు ఆత్మీయ కలయిక పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశారు. కుల సం ఘాలు పెద్ద లకు అభ్య ర్థులు భారీ గానే నోట్లు ఎర వేసి నట్లు సమా చారం. ఆయా సామా జికవర్గాల సంఖ్యా పరంగా రూ.4 నుంచి రూ.6 లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది.

➡️