టీడీపీ ఇంటింటా ఎన్నికల ప్రచారం 

Mar 25,2024 12:26 #East Godavari

జ్యోతుల లక్ష్మీదేవి
ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని మల్లవరం గ్రామంలో టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతులనెహ్రు కోడలు లక్ష్మీదేవి, మనవడు అనీష్ నెహ్రూ మల్లవరంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లవరం గ్రామం చేరుకొని స్థానిక శివాలయంలో పూజలు నిర్వహించి ఇంటింటికి ప్రచారం ప్రారంభించారు. జ్యోతుల లక్ష్మి దేవి మాట్లాడుతూ నియోజవర్గానికి శాశ్వత అభివృద్ధి కావాలంటే నెహ్రూ అవసరమని, సాగునీటి ప్రాజెక్టులను నియోజవర్గంనకు తీసుకురావడంలో అపర భగీరథుడిలా నెహ్రూకృషి చేశారని, అదే విధంగా విద్యాలయాలు, చిన్న తరహా పరిశ్రమలు, ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు తెచ్చిన ఘనత ఆయనకే చెల్లుతుందని ఆమె అన్నారు. మల్లవరం గ్రామంలో 132 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఘనత నెహ్రూదని తెలిపారు. లక్ష్మీదేవి, కొడుకు అనీష్ నెహ్రూ ఇంటింటికి తిరుగుతూ అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, పార్లమెంటుకు జనసేనకు గాజు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యక్రమాలు అభిమానులు పాల్గొన్నారు.

➡️