రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కృషి

May 21,2024 23:15 #Rajeev Gandhi Vardhanthi
Rajeev Gandhi vardhanthi

ప్రజాశక్తి-పెందుర్తి : మాజీ ప్రధానమంత్రి, కీర్తిశేషులు రాజీవ్‌గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువతీయువకులు కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు విన్నకోట రాము అన్నారు. జివిఎంసి 97వ వార్డు పరిధి చిన్నముసిడివాడ సమీపంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విన్నకోట రాము ఆధ్వర్యాన రాజీవ్‌ గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విన్నకోట రాము మాట్లాడుతూ, ప్రజా సంక్షేమానికి నిరంతరమూ కృషిచేసిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కిందని కొనియాడారు. భారతదేశ అభివృద్ధికి రాజీవ్‌గాంధీ ఎన్నో ప్రణాళికలు రూపొందించి అమలు చేశారన్నారు. వాటి ఫలితాలు నేటి యువతీయువకులు, ప్రజలు ఆస్వాదిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఆడారి రమేష్‌నాయుడు, పెందుర్తి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ముక్క రామునాయుడు, నాయకులు ఆర్‌ఆర్‌.నాయుడు, బి.రాంబాబు, టి.విశ్వనాధరావు, కెవి.ప్రసాదరావు, బి.మల్లేశ్వరరావు, ఎమ్‌.వెంకట్రావు, పి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

➡️