ఇళ్ల పట్టాలు అందజేత

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు అందించడం అనేది గొప్ప విషయమని మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ముప్పిడి వీరాంజనేయులు అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 9వ సచివాలయం పరిధిలో పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య అధ్యక్షతన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. సుమారుగా 140 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ముప్పిడి వీరాంజనేయులు, వైసిపి సీనియర్‌ నాయకులు మేడవరపు విద్యాసాగర్‌, కౌన్సిలర్‌ దొంతు మాధవ్‌, బత్తిన చిన్న అందజేశారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేర ప్రతి పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేశారన్నారు. మీరందరూ తప్పనిసరిగా 2024 ఎలక్షన్‌లో జగన్మోహన్‌ రెడ్డి బలపరిచిన వైసిపి అభ్యర్థులు ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌, చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి కంభం విజయ రాజుని ఓటు వేసి గెలిపించాలని తెలియజేశారు.

➡️