ఉచిత వైద్య శిబిరంలో మందుల పంపిణీ

ప్రజాశక్తి – జీలుగుమిల్లి

మండలంలోని దర్భగూడెం సచివాలయ మైదానంలో శనివారం పివిఎస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి, మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరాన్ని సర్పంచి సున్నం ఉషారాణి, సొసైటీ అధ్యక్షులు కొల్లూరి రాంబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. వైద్య శిబిరానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి సుమారు 200 మంది వరకు హాజరు కాగా వారికి పలు రకాల పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌ బివి.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు బిపి, షుగర్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహించి, మందులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పివిఎస్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు పి.సురేష్‌, ఉప సర్పంచి కేతిరెడ్డి రాఘవ రెడ్డి, ఎంపిటిసి సున్నం సురేష్‌, చిన్నిరామ సత్యనారాయణ, మాజీ సర్పంచి కొర్స వెంకటేశ్వరావు, పాండు, చౌదర రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️