ఉరేసుకుని వ్యక్తి మృతి

ప్రజాశక్తి – ముసునూరు

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన సంఘటన ముసునూరు మండలంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చింతలవల్లి శివారు గోగులంపాడు గ్రామానికి చెందిన పాలవెల్లి జగన్నాధరావు కుమారుడు పాలవెల్లి శ్రీనివాసరావు(47) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు కలరు. ఇతని భార్య తన పుట్టింటికి వెళ్లగా, మరునాడు భర్త వంట గదిలో చీరతో ఊరివేసుకున్నాడని మామయ్య తెలపటంతో వెంటనే వీరకుమారి బయల్దేరి రాగా అప్పటికే మృతి చెందాడు. భార్య వీరకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముసునూరు ఎస్‌ఐ పి.వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

➡️