చిత్రలేఖనం పోటీల్లో గ్రాయిత్రికి తృతీయ బహుమతి

ప్రజాశక్తి – ఏలూరు

హేలాపురి బాలోత్సవం ఏలూరులో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో జూనియర్స్‌్‌ విభాగంలో కె.గాయిత్రి 6వ తరగతి శనివారపు పేట, జెడ్‌పిహెచ్‌ స్కూల్‌ విద్యార్థిని గీసిన ‘పర్యావరణం’ చిత్రానికి తృతీయ బహుమతి వచ్చింది. సిఆర్‌ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి మేరీ ప్రశాంతి చేతుల మీదుగా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సమక్షంలో గాయిత్రి ఈ బహుమతిని అందుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రాధానోపాధ్యాయులు జి.ప్రకాష్‌ రావు, ఫస్ట్‌ అసిస్టెంట్‌ కె.రాజ్‌కుమార్‌, పేరెంట్స్‌ కమిటీ, అభివృద్ధి కమిటీ, పాఠశాల ఉద్యోగ సిబ్బంది విజేతను, చక్కని తర్ఫీదు ఇచ్చిన చిత్రలేఖనం ఉపాధ్యాయుడు ఎమ్‌డి.ఇర్షాద్‌ అహ్మద్‌ను అభినందించారు.

➡️