చిన్నారికి అండగా ఆళ్ల నాని

అనారోగ్యానికి గురైన బాలునికి వికలాంగుల పెన్షన్‌ మంజూరు

గతంలో బాలుని వైద్య నిమిత్తం రూ.5 లక్షల ఎల్‌ఒసి అందజేత

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌

ఏలూరు 31వ డివిజన్‌కు చెందిన బండ్లమూడి కోటేశ్వరరావు, లక్ష్మీతులసిల కుమారుడు బండ్లమూడి దుర్గా జయాన్ష్‌ అనారోగ్యానికి గురి కాగా ఆ బాలుని వైద్య చికిత్స నిమిత్తం ఎంఎల్‌ఎ ఆళ్ల నాని గతంలో సుమారు రూ.5 లక్షల మేర సిఎం ఆర్‌ఎఫ్‌ ఎల్‌ఒసి అందజేశారు. అనంతరం బాబుకు క్రమంగా కంటి చూపు మందగించడంతో ఈనెలలో వికలాంగుల పెన్షన్‌ మంజూరు చేశారు. ఈ మేరకు ఆళ్ల నాని చేతుల మీదుగా కొత్తగా మంజూరైన పెన్షన్‌ అందచేశారు. తమకు అన్ని విధాలా అండగా నిలిచిన ఆళ్ల నానికి బాలుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్పొరేటర్‌ పోతర్లంక లక్ష్మణరావు పాల్గొన్నారు.

➡️