తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి

ఏలూరు అర్బన్‌ : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌క్రాస్‌ తలసేమియా భవనంలో 10 మంది తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడిని నిర్వహించినట్లు జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తలసేమియా చిన్నారులకు క్రమం తప్పకుండా రక్తమార్పిడి నిర్వహిస్తున్నామన్నారు. 30 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన కొమ్మన బాలగంగాధర్‌ తిలక్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వరప్రసాదరావు, సిహెచ్‌.మౌనిక పాల్గొన్నారు.

➡️