తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి

ఏలూరు అర్బన్‌ : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌ క్రాస్‌ తలసేమియా భవనంలో బుధవారం 12 మంది తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడిని నిర్వహించామని జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల తలసేమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి చిన్నారుల రక్తమార్పిడికి సుమారు 80 నుంచి 100 యూనిట్ల రక్తం అవసరం అవుతుందని అన్నారు. స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు వచ్చి తలసేమియా వ్యాధి చిన్నారులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కార్యదర్శి కెబి.సీతారాం పాల్గొన్నారు.

➡️