పలు అభివృద్ధి పనులు ప్రారంభం

ప్రజాశక్తి – ముదినేపల్లి

మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముదినేపల్లి పోలీస్‌ స్టేషన్‌ దగ్గర నుంచి గ్రంథాలయం వరకు రూ.30 లక్షల నిధులతో నిర్మించబోతున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో రూ.16 లక్షలతో నూతనంగా నిర్మించిన రెండు మైక్రో ఫిల్టర్స్‌ పైప్‌ లైన్‌లను, గడపగడపకూ మన ప్రభుత్వం రూ.15 లక్షల నిధులతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే మండలంలోని సంఘర్షణ పురం, పెనుమల్లి గ్రామాల్లో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, జెడ్‌పిటిసి ఈడే వెంకటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు మొట్రూ ఏసు బాబు పాల్గొన్నారు.

➡️