భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలి

ప్రజాశక్తి – చింతలపూడి

ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేయాలని టిడిపి చింతలపూడి నియోజకవర్గ నాయకులు సోంగా రోషన్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. చింతలపూడి పట్టణంలో మంగళవారం చింతలపూడి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేయాలని లాయర్లు చేస్తున్న బైక్‌ ర్యాలీ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ మాజీ కన్వీనర్‌ జగ్గవరపు ముత్తారెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్‌ కృష్ణజ్యోతికి వినతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌ఛార్జి మేకా ఈశ్వరయ్య, మండల టిడిపి అధ్యక్షులు మాటూరి వెంకట్రామయ్య, టౌన్‌ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, జనసేన మండలాధ్యక్షులు చీదరాల మధుబాబు, టిడిపి ప్రధాన కార్యదర్శి కొండ్రు దేవా, తదితర టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

➡️