మత్స్యకారుల నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రజాశక్తి – టి.నరసాపురం

మండలంలోని బొర్రంపాలెంలో మత్స్యకారుల సహకార సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవమైంది. గ్రామానికి చెందిన సామాజిక వేత్త పెండ్యాల అభిషేక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికలో సంఘం నూతన అధ్యక్షుడిగా బత్తుల రమేష్‌, కార్యదర్శిగా ములికి ఏసు, కోశాధికారిగా బుడుపుల రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా అభిషేక్‌ మాట్లాడుతూ సంఘం ఏర్పడిన 20 ఏళ్ల కాలంలో సంఘ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక కావడం మొదటిసారి అన్నారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. మత్స్యకార సంక్షేమాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంఘ సభ్యులు ఐక్యతతో పనిచెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ సబ్యులు గుండె పోతురాజు, ధనరాజు, చిట్టియ్య, జక్రయ్య పాల్గొన్నారు.

➡️