‘మానవత’ ఆధ్వర్యాన వృద్ధురాలికి సాయం

ప్రజాశక్తి – పోలవరం

ఉండడానికి కనీసం ఇల్లు లేని దళిత వృద్ధురాలు బర్రె రాములమ్మకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా పోలవరం మానవత సేవా సంస్థ అధ్యక్షులు గణేష్‌ మాట్లాడుతూ మానవత సేవా సంస్థ ద్వారా అనేక సేవలు చేస్తున్నామని దానిలో ప్రధానంగా వైద్యం, విద్య, కుటుంబ పోషణ లేని వృద్ధులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. ఈ సంస్థలో ఎవరైనా సభ్యత్వం పొందాలంటే 600 రూపాయలు కట్టి పేరు నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ ఉపాధ్యక్షులు పూనెం పోసిరావు, చంద్రయ్య, ఆకుల నరసింహమూర్తి, నారాయణ, కోటంరాజు, రాంబాబు, వెంకటేశ్వరరావు, సిద్ధా కృష్ణమూర్తి పాల్గొన్నారు.

➡️