రూ.3.93 కోట్లతో అభివృద్ధిపనులు

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌

నగరంలోని పలు డివిజన్లలో రూ.3.93 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎంఎల్‌ఎ ఆళ్ల నాని మంగళవారం శంకుస్థాపన చేశారు. 47వ డివిజన్‌లో సుమారు రూ.94 లక్షల అంచనా వ్యయంతో 17 రోడ్లు, మూడు డ్రెయిన్ల నిర్మాణానికి, 48వ డివిజన్‌లో సుమారు రూ.90 లక్షల అంచనా వ్యయంతో తొమ్మిది రోడ్లు, పది డ్రెయిన్ల నిర్మాణానికి, 49వ డివిజన్‌లో రూ.1.15 కోట్ల అంచనా వ్యయంతో 24 రోడ్లు, నాలుగు డ్రెయిన్లు, 50వ డివిజన్‌లో రూ.94.12 లక్షల అంచనా వ్యయంతో ఆరు రోడ్లు, ఒక డ్రెయినేజీ, మరో సామాజిక భవన నిర్మాణానికి ఎంఎల్‌ఎ శంకుస్థాపన చేశారు.

➡️