వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి

ప్రజాశక్తి – జీలుగుమిల్లి

గ్రామస్తులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నిర్మాణాన్ని నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సర్పంచి సున్నం ఉషారాణి ఆదేశించారు. మండలంలోని దర్భగూడెం పంచాయతీ చీమలవారిగూడెం గ్రామంలో మంచి నీటి ట్యాంక్‌ శిథిలావస్థకు చేరడంతో నీటి ఎద్దడి రాకుండా జలజీవన్‌ మిషన్‌ నిధుల నుంచి రూ.33.10 లక్షలను కేటాయించి నూతన వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి సర్పంచి సున్నం ఉషారాణి, సొసైటీ అధ్యక్షులు కొల్లూరి రాంబాబు చేతులమీదుగా బుధవారం శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సున్నం సురేష్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ వినరు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సువర్ణ, జగన్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️