వృద్ధులకు కళ్లజోళ్ల పంపిణీ

ముసునూరు : అట్లూరి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అట్లూరి వెంకట రవీంద్ర కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో గత రెండు రోజుల క్రితం ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆపరేషన్‌ అవసరమైన వృద్ధులకు బుధవారం ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. లక్క పాము కాంతారావు, సత్యనారాయణ, పాల్గొన్నారు.

➡️